రజనీపై భారతీరాజా కామెంట్లు...


తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పార్టీపై, సింబల్ పై మాత్రం ఇంతవరకూ క్లారిటీ లేదు. త్వరలోనే దానిపై కూడా స్పష్టత ఇస్తానని రజనీ చెప్పారు. అయితే ఇక ఎప్పుడైతే రజనీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారో... కొంత మంది ఆనందిస్తున్నా... కొంతమంది మాత్రం కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా రజనీ పొలిటికల్ ఎంట్రీపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వయసులో ఉండగా హిమాలయాలు పట్టుకు తిరిగిన రజనీ వయసైపోయాక రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తానని వస్తున్నాడని ఆయన కామెంట్ చేశారు. రజనీకాంత్ నాన్-లోకల్ అని, రాష్ట్రంలో కనీసం నోటాతో పోటీ పడలేని బీజేపీ రజనీని అడ్డు పెట్టుకుని బలం పెంచుకోజూస్తోందని అన్నారు. అంతేకాదు.. జయలలిత మరణం, కరుణానిధి అనారోగ్యంగా ఉండడంవల్లే రజనీ, కమల్ వంటివారు బయల్దేరారని.. లేకపోతే వాళ్ళు బయటకు వచ్చేవారా అని ప్రశ్నించారు.