రజనీ వల్ల మాటపడ్డ ఏడుకొండలవాడు...

 

రాజకీయాలు మరీ ఎంత దారుణంగా తయారయ్యాయి అంటే.. ఆఖరికి తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను కూడా.. రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఎప్పటినుండో అభిమానులతో పాటు అందరినీ సస్పెన్స్ లో పెట్టి ఎట్టకేలకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చారో... లేదో..?అప్పుడే ఆయనపై విమర్శల దాడి పెరిగింది. పాపం ఆయన వల్ల దేవుడు మాటలు పడాల్సి  వచ్చింది. రజనీకాంత్ వల్ల దేవుడు మాటలుపడటం ఏంటని అనుకుంటున్నారా..? ఆ స్టోరీ ఏంటో చూద్దాం..

 

ఆద్యాత్మికత పేరుతో రజనీ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడే డీఎంకే పార్టీ రివర్స్ లో వస్తుంది. రజనీ ఆద్యాత్మికత పేరుతో ప్రజల్లోకి రావాలని చూస్తుంటే... డీఎంకే పార్టీ ఇంకోసారి ద్రవిడ ఉద్యమ స్ఫూర్తి రగిలించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు డీఎంకే ద్రవిడ ఉద్యమ పునాదుల మీద నడిచేది. అయితే కాలనుగుణంగా మారుతూ.. కొన్ని పరిస్థితుల వల్ల ద్రవిడ ఉద్యమాన్ని పక్కన పెట్టింది. ఇక ఇప్పుడు...  ఇక ఇప్పుడు ఆధ్యాత్మిక రాజకీయం అని రజని రేసులోకి రాగానే.. మళ్లీ ద్రవిడ ఉద్యమం అంటూ నాస్తికతను తెరపైకి తెచ్చారు.

 

ఆ క్రమంలోనే ఇకపై తమిళనాడులో నాస్తిక సభలు విరివిగా జరిగేలా చూడాలని ఆ పార్టీ అనుకుంటోంది. అంతేకాదు ఇటీవల  తిరుచ్చి లో నాస్తిక సమాజ మహానాడు జరగగా... అందులో డీఎంకే ఎంపీ , కరుణ కుమార్తె , స్టాలిన్ సోదరి కనిమొళి పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కనిమొళి.. ఏకంగా తిరుమల ఏడుకొండలవాడి మీదే విమర్శలు గుప్పించింది. “ తిరుమల ఏడుకొండలవాడు డబ్బున్న వాళ్ళకే దేవుడు. సామాన్యుడు ఆయన్ని దర్శించుకోవాలంటే పడిగాపులు కాయాల్సిందే. పేద‌వాడిని కాపాడ‌లేని దేవుడు మ‌న‌కెందుక‌ని.. సొంత హుండీని కాపాడుకోలేని ఆయన ఇక భక్తులని ఏమి కాపాడతాడు. ఏడుకొండలవాడు దేవుడై,ఆయనకు శక్తులు ఉంటే ఇక ఆయనకు భద్రత ఎందుకు ? అని సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్కడితో ఆగకుండా.... అసలు మతాలు ప్రపంచంలో వున్న మనుషుల్ని విడగొడుతున్నాయని, వారిని ఒక్క తాటి మీదకు తెచ్చే శక్తి నాస్తికత్వానికే వుంది. ప్రపంచ యుద్ధాల కన్నా మతాల వల్లే ఎక్కువ రక్తం చిందింది. ఈ జాతి ,మత ఘర్షణలు ఆగిపోవాలంటే నాస్తికవాదంతో పాటు మానవతావాదం వ్యాప్తి చెందాలి “ అని కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కనిమొళి చేసిన వ్యాఖ్యలు ఒక్క తమిళనాట మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నారు. ఏది ఏమైనా.. ఎంతో మంది భక్తులు.. ఎన్నో ప్రాంతాల నుండి ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చి.. శ్రీవారిని ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు స‌క‌ల పాపాలూ హ‌రించుకుపోతాయ‌ని నమ్ముకునే వారు ఎంతో మంది ఉంటే.. రాజకీయాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. మరి ఈ వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయో చూద్దాం...