TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అర్ధరాత్రి సీఎం ఆకస్మిక తనిఖీలు! స్టాలిన్ మరో సంచలనం..

Published on: Fri Oct 1, 2021 9:45AM

పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అప్పుడప్పుడు సైకిల్ పై తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్న సీఎం స్టాలిన్ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. పోలీస్ స్టేషన్‌లో పనితీరును తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలకు దిగారు. 

అర్థరాత్రి సమయంలో అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. సేలం నుంచి ధర్మపురికి వెళ్తుండగా ఆయన మధ్యలో అద్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ స్టేషన్ పనితీరును రికార్డులను పరిశీలించారు. సీఎం ఇలా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనిఖీలు చేయడంతో పోలీసులు షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్‌ను ఎప్పుడు నిర్మించారు. కేసులు నమోదవుతున్న తీరు, కేసుల పరిష్కారం తదితర విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. 

ప్రభుత్వం మారినప్పటికీ పాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొన్నింటిని అలానే కొనసాగిస్తున్నారు స్టాలిన్. జయలలిత పేర్లతో ఉన్న పథకాలను అవే పేర్లతో కొనసాగిస్తున్నారు. పిల్లలకు అందించే పుస్తకాలపై మాజీ సీఎం జయలలిత ఫుటోలు ఉండగా, అలానే వాటిని పిల్లలకు పంపిణీ చేసి ఖజానా భారం కాకుండా చూశారు. అమ్మ క్యాంటిన్లను అలానే కొనసాగిస్తున్నారు. ఖజానాపై భారం పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు సీఎం స్టాలిన్‌. తాజాగా ఆకస్మిక తనిఖీలతో ప్రజల మరింత అభిమానం చూరగొంటున్నారు.