TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

Published on: Fri May 7, 2021 3:23PM

తమిళనాడులో కొత్త సర్కార్ కొలువు దీరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించింది. డీఎంకే చీఫ్ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే వరాల జల్లు కురిపించారు స్టాలన్.  తొలి రోజే ఆయ‌న కీల‌క ఉత్త‌ర్వుల‌పై సంత‌కాలు చేశారు. 

ప్ర‌భుత్వ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణించే సౌక‌ర్యాన్ని క‌ల్పించారు స్టాలిన్. రేష‌న్ కార్డు ఉన్న దాదాపు రెండు కోట్ల కుటుంబాల‌కు రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సాయాన్ని కొవిడ్ ఆర్థిక‌ సాయం కింద ఇస్తున్న‌ట్లు  వివ‌రించారు. ఇందులో భాగంగా తొలి విడ‌త కింద త్వ‌ర‌లో రూ.2 వేల చొప్పున జ‌మ చేస్తామ‌ని తెలిపారు. త‌మిళ‌నాడు వ్యాప్తంగా లీట‌రు పాల‌పై రూ.3 త‌గ్గిస్తూ త‌మిళ‌నాడు కొత్త‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అలాగే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల‌కు అందించ‌నున్నారు.

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను వందరోజుల్లో  అమలు చేసేందుకు స్టాలిన్ కార్యాచరణ ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాకు. క‌రోనా వేళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్ర‌జ‌ల‌కు స్టాలిన్ సర్కార్ ప్ర‌క‌టించిన వ‌రాలు ఉపశ‌మ‌నం క‌లిగించేలా ఉన్నాయి.