జయలలిత జీవితంలో అత్యంత ముఖ్యమైనవి... ఈ పదే!

1. జయలలిత ప్రస్తుత బిరుదు పురచ్చి తలైవీ. కాని, ఆమె సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేస్తున్న సమయంలో ఆమెని కవర్చి కన్ని అనేవారు!

2. జయలలిత మొదటి సినిమా తెలుగు, తమిళం, కన్నడ కాదు... ఇంగ్లీష్! ఆమె 1961లో ఎపిస్టల్ అనే సినిమాలో నటించింది. 1966లో విడుదలైన ఆ సినిమా రూపొందించింది మాజీ రాష్ట్రపతి వివి గిరి కొడుకు శంకర్ గిరి.

3. గ్లామరస్ హీరోయిన్ గా దక్షిణాదిని మెస్మరైజ్ చేసిన జయలలిత నటీ కావాలని అస్సలు కోరుకోలేదు! లాయర్ అవ్వాలనుకునేది...

4. జయలలిత మొదటి భారతీయ భాషా చిత్రం ... బ్లాక్ బస్టర్ కన్నడ మూవీ చిన్నదా గొంబే.

5. జన్మతః తమిళ బ్రాహ్మణ అయ్యంగారైన జయలలిత... కర్ణాటకలోని మేల్ కొటే క్షేత్రంలో జన్మించారు!

6. 10ఏళ్ల వయస్సు నుంచీ తమిళనాడులోనే స్థిరపడిన జయ తనని తాను తమిళురాలిగానే భావించేది. ఆ విషయం సూటిగా ప్రకటించినందుకు ఆమెపై కన్నడ సంఘాలు 1970లలో నిరసనలకి దిగాయి. కాని, జయలలిత క్షమాపణ చెప్పేందుకు ససేమీరా అన్నారు...

7. 1973లో ఆమె చేసిన సూర్యగంధి సినిమాలో... స్వయంశక్తితో ఎదిగిన పరిణతి కలిగిన స్త్రీగా మెప్పించింది!

8. తరువాతి కాలంలో జయలలిత జీవితాన్నే మలుపు తిప్పిన యాక్టర్ కమ్ పొలిటీషన్, ఎంజీ రామచంద్రన్, మొట్ట మొదట ఆమెతో జోడీ కట్టడానికి వెనుకాడారు! ఆమె తనకంటే వయస్సులో చాలా చిన్నది కాబట్టి ఎంజీఆర్ జయను తన పక్కన హీరోయిన్ గా వద్దన్నారు!

9. జయలలితపై ఎలాంటి నమ్మకం లేకుండా మొదటి సినిమా చేసిన ఎంజీఆర్... తరువాత ఆమెతో 28సినిమాలు చేశారు! రాజకీయాల్లో కూడా జయను జయప్రదంగా ప్రవేశపెట్టింది ఆయనే!

10. ఎంజీ రామచంద్రన్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీలో 1982లో చేరారు పురుచ్చి తలైవీ. ఆ తరువాత ఆమె మొత్తం నాలుగు సార్లు తమిళనాడు సీఎం అయ్యారు!