సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్
posted on Jul 4, 2025 3:55PM

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంటూ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. ఎన్నికల్లో ఏ పార్టీలోనూ పోత్తు పెట్టుకోబోమని ఒంటరిగా పోటీ చేస్తామని పేర్కొన్నాది.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదన్న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తెలిపారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని, తమిళనాడులో ఆ పార్టీ విష రాజకీయాలు చెల్లవని విజయ్ తెలిపారు. అలాగే, వచ్చే నెలలో భారీ ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. తమ పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది.