TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ధోతీలు వద్దంటే లైసెన్సులు రద్దువుతాయ్: జయ

Published on: Thu Jul 17, 2014 9:54AM

 

తమిళ సంస్కృతిలో లుంగీ, ధోతీ అంతర్భాగం. తమిళనాడు ఏ ప్రదేశానికైనా పంచెకట్టుని అనుమతించమని క్లబ్బులు అంటే, సదరు క్లబ్‌ల లైసెన్సులు రద్దు చేస్తాం’ అని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వార్నింగ్ ఇచ్చారు. ఒక జడ్జి గారిని పంచెకట్టుతో క్లబ్‌లోకి రానివ్వమని చెప్పడంతో వివాదం తలెత్తింది. చెన్నై చేపాక్‌లో వున్న క్రికెట్‌ క్లబ్‌లో తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి హరిపరంధామన్‌, ఇద్దరు న్యాయవాదులు వెళ్లారు. ఆ ముగ్గురూ పంచెకట్టుతో ఉండడంతో క్లబ్‌ సెక్యూరిటీ లోనికి అనుమతించలేదు. దీనిమీద ముఖ్యమంత్రి జయలలిత జోక్యం స్పందించారు. తమిళ సంప్రదాయం, ఆచారాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థలను నియంత్రించడానికి, సంప్రదాయాల రక్షణకు ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. తమిళ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించే క్లబ్‌, సంస్థల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జయలలిత ప్రకటనను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్వాగతించాయి.