TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమిళనాడు సీఎం విజయ్ సింప్లిసిటీ!

Published on: Fri May 29, 2026 10:11AM

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో  దళపతి గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు విజయ్ జోసెఫ్. నట జీవితం నుంచి రాజకీయాలలోకి ప్రవేశించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.  అటువంటి విజయ్ సింప్లిసిటీకి నెటిజనులు ఫిదా అవుతున్నారు.  తాజాగా  సీఎం విజయ్ కి సంబంధించిన ఒక   ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.  విమాన ప్రయాణంలో ఎయిర్ హోస్టెస్‌తో విజయ్ దిగిన ఈ ఫోటో, ప్రస్తుతం నెటిజన్ల మనసులను దోచుకుంటోంది.

ఆ ఫోటోలో విజయ్ ముఖంలో కనిపించిన అమాయకత్వం, ప్రశాంతత చూసి అభిమానులతో పాటు సామాన్య జనం కూడా  ఫిదా అయిపోతున్నారు. ఇంతటి స్టార్‌డమ్ ఉన్న ఒక  నటుడు, ముఖ్యమంత్రి ఇంత సింపుల్ గా ఉన్నాడో కదా అంటూ నెటిజనులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.  ఎంత సాధారణంగా ఉన్నాడో కదా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 ఇటీవల విజయ్ ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో  ఒక ఎయిర్ హోస్టెస్ విజయ్‌ను గుర్తుపట్టి, ఆయనతో ఒక ఫోటో దిగాలని వినమ్రంగా కోరింది. సాధారణంగా కొందరు సెలబ్రిటీలు ఇలాంటి సమయాల్లో కాస్త విముఖత చూపడం లేదా హడావిడిగా ముగించడం చూస్తుంటాం. కానీ..  విజయ్ మాత్రం  ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ ఆమె పక్కన నిలబడి ఫోటోకు ఫొజులు ఇచ్చారు. ఆ ఫోటోలో ఆయన వేసుకున్న సాధారణ దుస్తులు, చెదరని చిరునవ్వు ఆయనలోని నిరాడంబరతను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.