జయలలితకు స్టాలిన్ సలహా..

రాజకీయాల్లో అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలకంటే తమిళనాడు రాజకీయాలు కాస్త తేడాగా ఉంటాయి. చాలా భయంకరమైన పాలిటిక్స్ జరుగాతాయి ఇక్కడ. ఇక అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పచ్చగడ్డివేస్తేనే భగ్గుమనే పరిస్థితి. మరి అలాంటి నేపథ్యంలో ఒకరిమీద ఒకరు ఏ రకంగా విమర్శల బాణాలు సంధించుకుంటారో తెలియంది కాదు. అలాంటి వాతావరణం ఉన్న క్రమంలో జయలలితకు.. ఆమె ప్రత్యర్థి పార్టీ డీఎంకే అభ్యర్ధి అది కూడా స్టాలిన్ నుంచి ఓ సలహా రావడంతో అది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

అదేంటంటే.. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలుపొంది నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గతంలో ఇచ్చిన హామిని గుర్తుంచుకొని దానికి ఇప్పుడు శ్రీకారం చుడుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి బీహార్లో పూర్తిగా మధ్యపానం నిషేదం చేస్తామని హామి ఇచ్చారు. ఇప్పుడు నితీశ్ తీసుకున్న నిర్ణయం లాగే తమిళనాడులో కూడా మధ్యపానం పై నిషేధం విధించాలని.. మధ్యపానం వల్ల తమిళనాడులో ఉన్న ఎన్నో కుటుంబాలు పాడైపోయాయి.. ప్రజల కోసం పనిచేయడం అంటే నితీశ్ లాంటి నిర్ణయం తీసుకోవడమే అని.. ఇది తన డిమాండ్ కాదని.. ప్రజల డిమాండ్ గా తీసుకోవాలని జయలలితకు సూచించారట. మరి స్టాలిన్ ఇచ్చిన సలహాకు జయలలిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.