TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జయ నివాసం వద్ద అంబరాన్నంటిన సంబరాలు..!

Published on: Thu May 19, 2016 11:19AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలను తలక్రిందులు చేస్తూ విజయం దిశగా సాగిపోతోంది. దీంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, జయ అభిమానులు చెన్నైలోని సీఎం అధికార నివాసం పోయిస్ గార్డెన్స్‌కు భారీగా చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏఐఏడీఎంకే 130, డీఎంకే 97, పీఎంకే 4 ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అన్నాడీఎంకే విజయం సాధిస్తే జయలలిత ఆరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు.