స్పీకర్‌పై డీఎంకే అవిశ్వాస తీర్మానం

తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఎత్తులపై ఎత్తులు వేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం లేకుండా జరిగిన బలపరీక్ష చెల్లదంటూ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన డీఎంకే తాజాగా మరో వ్యూహం రచించింది. తమిళనాడు శాసనసభ స్పీకర్ ధన్‌పాల్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ నెల 18న జరిగిన బలపరీక్ష సందర్భంగా స్పీకర్ సభా నియమాలను ఉల్లంఘించారని..ప్రతిపక్ష సభ్యులను బయటకు గెంటేసి..మార్షల్స్‌తో దాడి చేయించారని నోటీసులో పేర్కొంది. స్పీకర్ తీరుకు నిరసనగా ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని నిర్ణయించింది..ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు ప్రతిని అందజేశారు.