TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమిళ దళపతిపై ముస్లిం సంస్థ ఫత్వా జారీ ఎందుకంటే?

Published on: Thu Apr 17, 2025 4:27PM

 

తమిళ వెట్రి కళగం అధినేత, నటుడు ద‌ళ‌ప‌తి విజయ్‌పై యూపీలోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు, చష్మే దారుల్ ఇఫ్తా చీఫ్ ముఫ్తీ మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేలీ ఈ ఫత్వాను జారీ చేశారు. విజయ్ ముస్లిం వ్యతిరేకి అని, అతని నేపథ్యం.. అత‌డి గ‌త‌ చర్యలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని ఫత్వాలో పేర్కొన్నారు. మద్యం తాగే వారిని, జూదగాళ్లను విజయ్ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించి రంజాన్ మాసం పవిత్రతను దిగజార్చారని రజ్వీ, ద‌ళ‌ప‌తి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను నమ్మవద్దని, మత పరమైన కార్యకలాపాలకు అతణ్ని ఆహ్వానించవద్దని తమిళనాడు ముస్లింలకు సూచించారు. 

ఇక విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని.. ఈ మూవీలో ముస్లింల వ్యతిరేకిగా ఉన్న విజయ్.. రాజకీయాల్లోకి రాగానే ముస్లిం ఓటు బ్యాంకు కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆయనకు దూరంగా ఉండాలని ముస్లిం సంఘ నాయకులు సూచించారు.విజయ్ రంజాన్ మాసం యొక్క పవిత్రతను దిగజార్చారని రజ్వీ పేర్కొన్నారు. ఆహ్వానించబడిన వారు ఉపవాసం పాటించలేదని, ఇస్లాం యొక్క ఆచారాలను అనుసరించలేదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, తమిళనాడులోని సున్నీ ముస్లింలు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ముస్లింలు విజయ్‌కు దూరంగా ఉండాలని, ఆయన నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావద్దని, అలాగే వారి మతపరమైన కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించవద్దని రజ్వీ విజ్ఞప్తి చేశారు.