TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆస్పత్రిలో నటుడు విజయకాంత్.. ఆరోగ్యం విషమం!

Published on: Mon Nov 20, 2023 9:55AM

నారాయణన్‌ విజయ్‌రాజ్‌ అళగర్‌స్వామి... ఈ పేరు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ, విజయ్‌కాంత్‌ అంటే ఠక్కున అందరికీ గుర్తొస్తుంది. యాక్షన్‌ హీరోగా తమిళ్‌, తెలుగు భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న విజయ్‌కాంత్‌ హీరోగానే కాదు, రాజకీయ నాయకుడిగా కూడా తనదైన  ముద్రను వేశారు. ఒకప్పుడు కోలీవుడ్‌లో  హీరో విజయ్‌ కాంత్‌  ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలకు ప్రాణం పోశారు. లక్షల మంది అభిమానులను సంపాదించాడు. ఆ తరువాత సినిమాలు వదిలి.. ప్రజా జీవితంలోకి వచ్చి  డీఎండీకేను స్థాపించారు. విజయ్‌కాంత్‌ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం విజయ్‌కాంత్‌ ఆరోగ్య పరిస్థితి విషమించి  హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది. 


తీవ్రమైన జ్వరం,  జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో విజయ్‌ కాంత్‌ హాస్పిటల్‌లో చేరినట్టు సమాచారం. సాధారణ వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను ఒక రోజు అబ్జర్వేషన్‌లో  ఉంచాలని వైద్యులు చెప్పినట్లు సమాచారం.  దీర్ఘ కాలంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న విజయ్ కాంత్ కు గతంలో  మూడు వేళ్లను డాక్టర్లు తొలగించారు.

ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా విజయ్‌కాంత్‌ వీల్‌ చైర్‌లోనే వెళ్తుంటారు. ఆయన వయస్సు 70 ఏళ్లు. విజయకాంత్‌ తమిళ సినీ పరిశ్రమపై  తనదైన ముద్ర వేసిన ఆయన  రాజకీయాల్లో అడుగుపెట్టి దేశీయ ముర్పోక్కు ద్రావిడ కలగం (డీఎండీకే) స్థాపించారు.  రాజకీయ నాయకుడిగానూ తమిళనాట తనదైన ముద్ర వేశారు. తమిళ నటుడు, నటీనటుల సంఘానికి  అధ్యక్షుడుగా కూడా  విజయకాంత్‌  పనిచేశారు.