తమిళ సీనియర్ నటుడు బాలు ఆనంద్ మృతి
Published on: Fri Jun 3, 2016 3:26PM

తమిళ సీనియర్ నటుడు, దర్శకుడు బాలు ఆనంద్ కన్నుమూశారు. కోయంబత్తూరులో నివసిస్తున్న ఆయనకు ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. దాదాపు 100 సినిమాల్లో నటించిన ఆయన కొన్ని తమిళ సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. బాలు ఆనంద్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మరణం పట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.


