TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమన్నాకు తీరని కోరిక..!

Published on: Sat Mar 16, 2013 10:36AM

 

 

tamanna mahesh babu, mahesh babu tamanna, tamanna latest movies

 

 

దేవుడు వరమిచ్చినా... పూజారి కనికరించనట్లు... మిల్కీ బ్యూటీ తమన్నా పరిస్థితి కూడా అలానే ఉంది. నాజూకు అందాలతోపాటు... లేలేత పరువాలతోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తూ బాలీవుడ్ వరకూ ఈజీగా దూసుకుపోయిన తమన్నా.... టాలీవుడ్ లో మాత్రం ఓ అవకాశం కోసం... కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. అదే ప్రిన్స్ మహేశ్ బాబు సరసన నటించే ఛాన్స్....‍! తమన్నాకు ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. కానీ, ఎప్పుడూ హీరోయిన్లనే డామినేట్ చేసే మహేశ్ బాబు మాత్రం... తన కన్నా తళతళమని మెరిసిపోయే మిల్కీ బ్యూటీతో నటించేందుకు జంకుతున్నాడట. కాబట్టీ.. టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించేయాలన్న మన మిల్కీ బ్యూటీ కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు.