Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పొడవు వారు.. గట్టివారు..
posted on: Mar 8, 2016 9:30AM
పొడవుగా వుంటే జీవితంలో అన్నింటా ముందుంటారు.. నిజం నమ్మండి అంటున్నారు ‘ఎకనామిక్స్ అండ్ హ్యూమన్ బయాలజీ’ పరిశోధకులు. దాదాపు నాలుగు లక్షల మందితో వారు చేసిన సర్వేలో ఈ విషయం తేలింది.
సుమారు ఐదడుగుల పదంగుళాలకు మించి ఎత్తుండే మగవారు తమ తోటివారితో పోలిస్తే చదువులోనూ, సంపాదనలోనూ, సామాజిక సంబంధాల విషయంలోనూ, ఆనందంలోనూ ముందుంటారట.
వారి ఎత్తుతోపాటు వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా వుండటం గుర్తించారు ఆ సర్వేలో. ఇక ఆడవారి ఎత్తు 5.4 అడుగులు మించితే ఇంచుమించు వారిలో కూడా ఆత్మవిశ్వాసం, చురుకుదనం, తెలివితేటలు ఎక్కువగా ఉండటం గుర్తించారు.
ఇంకా ఈ విషయంలో అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఇంకెన్ని విషయాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచబోతున్నాయో వేచిచూడాలి. ప్రస్తుతానికైతే పొడవు వాళ్ళు గట్టివాళ్ళు అనుకోవాలి.
-రమ



.jpg)


