హిజాబ్‌కు తాలిబన్ల మద్దతు.. రచ్చ రంబోలా..
Published on: Fri Feb 11, 2022 11:06AM
ఇప్పటికే హిజాబ్‌పై రచ్చ రంబోలా అవుతోంది. కర్ణాటక నుంచి యావత్ దేశానికి పాకిందీ వివాదం. హిజాబ్‌కు అనుకూల, వ్యతిరేక వాదాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోర్టులు సైతం చాలా సాఫ్ట్‌గా డీల్ చేస్తున్నాయి ఈ విషయాన్ని. హిజాబ్‌పై ఇప్పటికే పాకిస్తాన్ మంత్రి స్పందించడం.. ఆయనకు ఎమ్ఐఎమ్ చీఫ్ అసద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరం. ముందు మీ పాకిస్తాన్ సంగతి చూసుకోండి.. మలాలాపై దాడి చేసిన దేశం మీదంటూ పాక్ నోరు మూయించారు ఓవైసీ. ఇక, లేటెస్ట్‌గా అఫ్ఘనిస్తాన్‌ను ఏలుతున్న మత చాందసవాద తాలిబన్లు సైతం కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదంపై స్పందించడం కలకలం రేపుతోంది. విషయం ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీస్తుందోననే టెన్షన్ మొదలైంది. అంతర్జాతీయంగా భారత ఉదంతం చర్చణీయాంశంగా మారింది.
కర్ణాటక రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసిన హిజాబ్ వివాదంపై అఫ్ఘానిస్థాన్ దేశంలోని తాలిబన్లు స్పందించారు. కర్ణాటకలో హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలకు తాలిబన్లు మద్ధతు ప్రకటించారు. కర్ణాటక ముస్లిం అమ్మాయిలు ఇస్లామిక్ విలువల కోసం నిలబడ్డారని తాలిబన్లు వారిని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం బాలికలు తమ మతపరమైన ఇస్లామిక్ విలువను కాపాడుకునే మార్గాల్లో త్యాగాలు చేశారని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘానిస్థాన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగాని ట్వీట్ చేశారు. కర్నాటకలో అల్లాహు అక్బర్ నినాదాలు చేసిన నల్ల బురఖా ధరించిన అమ్మాయి చిత్రాన్ని సమంగాని షేర్ చేశారు.
కర్నాటకలోని ముస్లిం బాలికలు 'లౌకికవాదం' కోసం నిరసనలు చేస్తున్నారని సలీమ్ జావేద్ అనే పాకిస్థానీ చేసిన ప్రతిస్పందనపై కూడా అతను తీవ్రంగా ప్రతిస్పందించాడు. హిజాబ్ ధరించిన అమ్మాయిలను.. ఖతార్ అధికారిక ప్రతినిధి సుహైల్ షాహీన్ వంటి సీనియర్ తాలిబన్ అధికారులు సమర్ధించారు. తమ కాలేజీ డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘిస్తూ హిజాబ్ ధరించాలని డిమాండ్ చేస్తున్న ముస్లిం బాలికలకు తాలిబన్లు మద్దతు ప్రకటించారు.


