TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాక్ పై తాలిబన్ల డ్రోన్ దాడులు!

Published on: Wed Jul 1, 2026 9:37AM

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల నడుమ నడుస్తున్న ప్రచ్ఛన్నయుద్ధం..  ఇప్పుడు ప్రత్యక్ష వైమానిక దాడులకు దారి తీసింది. రెండు మూడు రోజుల కిందట ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన  వైమానిక దాడులకు ప్రతీకార దాడులకు దిగింది  పాకిస్థాన్  భూభాగంలోకి చొచ్చుకుంటూ వెళ్లేలా  అధునాతన డ్రోన్లతో తాలిబన్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ ఆకస్మిక ప్రతిదాడితో పాక్ రక్షణ విభాగాలు అప్రమత్తమయ్యాయి.   డ్యూరాండ్ లైన్ సరిహద్దు రీజియన్ ఇప్పుడు ఇరు దేశాల క్షిపణులు, డ్రోన్ల  దాడులతో అట్టుడుకుతోంది.

 పాకిస్థాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలైన బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుని ఆప్ఘనిస్థాన్ దాడులకు పాల్పడింది.  అయితే తాలిబన్ ప్రభుత్వం.. తాము   పాక్ సైన్యంపై కాకుండా, అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ అంటే ఐసిస్-కే   ఉగ్రవాద ముఠాల టార్గెట్ గా దాడులకు పాల్పడినట్లు ప్రకటించింది. 

ఆఫ్ఘనిస్థాన్‌లో అమాయక పౌరులను బలితీసుకుంటున్న విద్రోహ చర్యలన్నింటికీ పాక్ భూభాగంలో ఉన్న ఈ రహస్య స్థావరాల నుంచే ప్రణాళికలు రూపొందుతున్నాయని పేర్కొంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఒక పాఠశాల భవనాన్ని ఐసిస్ ఉగ్రవాదులు తమ అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్ కోసం వాడుకుంటున్నారని గుర్తించి, దానిని డ్రోన్లతో   ధ్వంసం చేసినట్లు ఆఫ్ఘన్‌  చెందిన ప్రముఖ మీడియా సంస్థ  టోలోన్యూస్ వెల్లడించింది. ఈ మెరుపు దాడిలో పలువురు కరడుగట్టిన ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారని, స్థానిక పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తాలిబన్ ప్రతినిధులు ప్రకటించారు. 

ఇటీవల  పాక్ వైమానిక దళం ఆఫ్ఘన్ సరిహద్దు దాటి జరిపిన దాడుల్లో భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించిన సంగతి తెలిసిందే.  ఐక్యరాజ్యసమితి అధికారిక నివేదిక ప్రకారం, ఆ పాక్ దాడుల వల్ల 28 మంది   ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, పాకిస్థాన్ రక్షణ దళాలు మాత్రం తాము పౌరులను కాదని, తమ ఆపరేషన్‌లో 29 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను ఖతం చేశాయని చెప్పాయి. చెప్పుకొచ్చాయి. పాక్ ప్రకటనను ఖండించిన తాలిబన్ ప్రభుత్వవం వాస్తవానికి  ఐక్యరాజ్యసమితి అంచనాల కంటే పాక్ దాడుల వల్ల జరిగిన నష్టం చాలా ఎక్కువ అని పేర్కొంది.  ఆ ఈ దారుణానికి ప్రతీకారంగానే తాము ప్రతిదాడులకు పాల్పడినట్లు తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. సరిహద్దుల్లో నెలకొన్న ఈ భయానక వాతావరణంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా భారత్ ఈ వ్యవహారంలో అత్యంత వేగంగా స్పందిస్తూ పాకిస్థాన్ వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుబట్టింది.