కేంద్రం నిర్ణయానికి అందరూ కట్టుబడాలి: అరుణ
Published on: Thu Dec 22, 2011 11:47AM
హై
దరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చే శక్తి తమ పరిధిలోనిది కాదని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ, ఎఫ్‌డిసి శాఖామాత్యులు డికె అరుణ అన్నారు. అయితే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాల్సిందేనని ఆమె అన్నారు. అరుణ నంది నాటకోత్సవాల బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాల్లాడుతూ తెలుగు ప్రజలు ఐక్యతగా ఉండాలని అందరం కోరుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి మనోభావాలను గౌరవిస్తుందని అరుణ వెల్లడించారు. తెలంగాణ ఆడపడుచుగా మా ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే తెలుగు ప్రజలందరూ ఐక్యంగా ఆనందంగా ఉండాలనే కోరుకుంటానని అరుణ చెప్పారు.


