మెసేజ్ రిప్లై ఇవ్వలేదని విడాకులు... కోర్టు మంజూరు..

 

టెక్నాలజీ దగ్గరవుతున్న కొద్దీ.. మనుషుల మధ్య బంధాలు, సంబంధాలు రోజు రోజుకి దూరమవుతున్నాయి. ఈ మధ్య ఫోన్లలోనే  విడాకులు తీసుకునే ట్రెండ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కేవలం తాను పెట్టే మెసేజ్ లకు సమాధనం ఇవ్వలేదన్న కారణంగా..ఓ భార్య తన భర్తకి విడాకులు ఇవ్వడానికి కోర్టును ఆశ్రయించింది. ఇంకా విచిత్రమేంటంటే... ఈ విడాకులను న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ ఘటన తైవాన్ లో జరిగింది. వివరాల ప్రకారం.. తైవాన్‌ కి చెందిన లిన్‌ అనే ఆమె, తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, సోషల్ మీడియా ద్వారా తాను పెట్టే మెసేజ్ లకు సమాధానం ఇవ్వడం లేదని... పిటిషన్ లో పేర్కొంది. అంతేకాదు..  తన తల్లిదండ్రులు, సోదరీమణులకు సేవలు చేయాలని తనను ఆదేశిస్తున్నాడని ఆమె పిటిషన్ లో పేర్కొంది. ఇక దీనిపై విచారణ జరిపిన కోర్టు...ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్న కనీసం మాట్లాడుకోవడం లేదని..  ఆమె ప్రమాదానికి గురైన సమయంలో కూడా మెసేజ్ చూసినా స్పందించలేదని నిర్ధారించి విడాకులు మంజూరు చేసింది.