Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీ20 వరల్డ్ కప్ విజేత టీమ్ ఇండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే?
posted on: Mar 9, 2026 9:30AM

అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (మార్చి 8) రాత్రి జరిగిన టి20 ఫైనల్ లో విజయం సాధించిన టీమ్ ఇండియాకు దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఈ వరల్డ్ కప్ విజయం ద్వారా పలు రికార్డులను తిరగరాసిన టీమ్ ఇండియా ఈ విజయంతో స్వీకరించే ప్రైజ్ మనీ విషయంలో కూడా కొత్త రికార్డు సృష్టించింది.
ఔను టి20 వరల్డ్ కప్ విజేతకు ఈ సారి రికార్డు స్థాయిలో 3 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా దక్కింది. అంటే మన రూపాయల్లో అక్షరాలా 27 కోట్ల 30 లక్షలు. ఐసీసీ ఈ సారి మొత్తం ప్రైజ్ పూల్ ను 13.5 మిలియన్ డాలర్లు చేసింది. అంటే గతంతో పోలిస్తే 20 శాతం పెంచింది. దీంతో ఈ టోర్నీ విజేత టీమ్ కు ప్రైజ్ మనీ కూడా భారీగా పెరిగింది.
గత ఏడాది టి20 వరల్డ్ కప్ విజయం సాధించిన రోహిత్ సేనకు దక్కిన ప్రైజ్ మనీ 22 కోట్ల 30 లక్షల రూపాయలు. అదే ఈ సారి టి20 వరల్డ్ కప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు అందినే ప్రైజ్ మనీ దాని కంటే దాదాపు 5 కోట్ల రూపాయలు ఎక్కువ.



.webp)


