TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంధుల టీ-20 ప్రపంచకప్: పాక్ ను చిత్తు చేసిన భారత్

Published on: Fri Dec 14, 2012 8:49AM

 

T20 World Cup for blind, India beat Pakistan, T20 World Cup for the Blind 2012, T20 World Cup India

 

అంధుల టి-20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్ ను చిత్తుచేసి భారత్ వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ పై 29 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 258 పరుగులు చేసింది. కేతన్ భాయ్ పటేల్ 98 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.


259 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 229 పరుగులు చేసింది. గ్రూప్ దశలో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైన భారత్ అందుకు ప్రతీకారం తీర్చుకుంది. గ్రూప్ దశలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్ ఫైనల్‌లో అదే స్థాయిలో రాణించలేకపోవడం గమనార్హం.