TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నెల్లూరు తళుకు బెళుకు లేవీ?

Published on: Mon May 14, 2012 12:33PM

కళాబందు ఎక్కడుంటే అక్కడ సినీతారలు ప్రత్యక్షమవుతారు. అటువంటి తారలు లేకుండా ప్రచారం ఏమిటీ? అని నెల్లూరు ఓటర్లు కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి తిక్కవరపు సుబ్బిరామి రెడ్డిని చూసి గుసగుసలాడుతున్నారు. ఇంకా నెలరోజులు ఉంది కాబట్టి ఆయన తారలను దింపవచ్చని ఓటర్లు ఎదురు చూస్తున్నారు. హీరోయిన్లను గ్యారెంటీగా రంగంలోకి దింపుతారని నెల్లూరు యువ ఓటర్లు ఎదురు చూస్తున్నారు.

 

 

 

సుబ్బిరామిరెడ్డి పారిశ్రామికవేత్త కూడా అయినందున డబ్బును విరివిగా ఖర్చుచేస్తారన్న అంచనాతో కార్యకర్తలు ఉన్నారు. సుబ్బిరామిరెడ్డి ముందుగా సెంటిమెంటు, స్థానిక పరిచయాలతో ప్రచారం చేస్తున్నారు. ఈ రెండింటితో వర్క్ అయినా కాకపోయినా సినీతారలు యువఓటర్లకు గేలం వేస్తారని సుబ్బిరామిరెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆయన స్తానికుకు అదని చెప్పుకోవడానికి జన్మస్థలమైన జెజెపేట నుంచి ప్రచారం ప్రారంభించారు. అలానే కనిపించిన ప్రతి ఓటరు నుంచి హామీ తీసుకున్న తరువాతే వారిని వదిలేస్తున్నారట. అంటే ఏమైనా నెల్లూరు స్థానం నుంచి గెలుపుగుర్రాన్ని ఎక్కాలని సుబ్బిరామిరెడ్డి ఆశిస్తున్నట్లు వాతావరణం కనిపిస్తోంది.