TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ కార్యాలయంలో టీ-పీసీసీ అధ్యక్షుడి దిష్టి బొమ్మ దగ్ధం

Published on: Wed Aug 13, 2014 11:19AM

 

ప్రతిపక్షాలు అధికారపార్టీ నేతల దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ప్రజలు చూసి ఉంటారేమో కానీ స్వంతపార్టీ నేతల దిష్టి బొమ్మలను పార్టీ కార్యాలయంలోనే దగ్ధం చేయడం బహుశః ఎప్పుడూ కనీవినీ ఉండరు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏదయినా సాధ్యమేనని నిరూపిస్తూ తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దిష్టిబొమ్మను పార్టీ కార్యాలయంలోనే దగ్ధం చేసారు మెదక్ జిల్లా జహీరాబాద్ కు చెందిన మైనార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు నేతలు. తమ నాయకుడు ఫరీదుద్దీన్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినందుకు నిరసనగా వారు పార్టీ కార్యాలయంలోనే పొన్నాల దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ ప్రతాపం చూపారు.