టి బిల్లు శీతాకాల సమావేశాల్లో డౌటే

 

సీమాంద్ర ప్రాంతం నుంచి ఎన్ని నిరసనలు వ్యక్తం అవుతున్నా.. కేంద్రం మాత్రం తెలంగాణ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర విభజన బిల్లు త్వరలోనే పార్లమెంట్‌లో ప్రవేశ పెడతామని కేంద్ర హొం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. అయితే ఖచ్చితంగా శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్‌కు వస్తుందా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి జీవోఎం సమావేశాలు దాదాపు పూర్తయ్యాయి. కేంద్ర న్యాయ శాఖ అభిప్రాయం తీసుకున్న తర్వాత,అది మళ్లీ జీవోఎం ముందుకు వస్తుంది. ఆ తర్వాతే దానిని కేబినెట్ ముందు పెడతాం అని షిండే తెలిపారు. ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత, రాష్ట్రపతి అనుమతి కోసం పంపిస్తామన్నారు.