వైమానిక దాడుల్లో 33 మంది మృతి...
Published on: Wed Mar 22, 2017 6:43PM

సిరియాలో తరచూ ఉగ్రవాదులపై వైమానిక దాడులు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా జరిగిన వైమానిక దాడిలో సుమారు 33 మంది మృతిచెందారు. వివరాల ప్రకారం.. సిరియాలోని రక్కా సిటీ సమీపంలో ఉన్న అల్ అన్సౌరా గ్రామంపై వైమానిక దాడి జరిపారు. గ్రామంలో ఉన్న బిల్డింగ్లో శరణార్థులు తలదాచుకుంటున్నారు. దాడి వల్ల సుమారు 50 కుటుంబాలు గల్లంతు అయి ఉంటాయని అంచనా వేస్తున్నారు.


