ఇస్లామిక్‌ స్టేట్‌ పని ఇక అయిపోయినట్టే...!


సిరియాలోని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఉన్న ఉగ్రవాదులు స్థావరాలపై రష్యా మిలటరీ వైమానికి దాడులు జరుపుతుంది. ఈ దాడుల్లో చాలామంది ఉగ్రవాదులే హతమయ్యారు. ఇప్పుడు దీనిపై సిరియాలో సైన్యానికి నాయకత్వం వహిస్తున్న సెర్గీ రుడోస్కీ  మాట్లాడుతూ... సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ కథ దాదాపు ముగిసినట్టేనని.. సిరియాలో కేవలం 8 శాతం భూభాగం మాత్రమే ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల చేతిలో ఉందని.. దీనిని కూడా కొద్ది రోజుల్లోనే స్వాధీనం చేసుకుంటామని.. ఉగ్రవాదులపై సైన్యం విజయం సాధిస్తోందని తెలిపారు. రష్యా వైమానిక దళం క్రమం తప్పకుండా ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయని అన్నారు.