కొత్త డౌట్...పోస్టర్లో ఉన్నది ఎవరబ్బా...?


 

చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఒకపక్క చిరు పుట్టినరోజు... మరోపక్క ఆయన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలకావడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇక మోషన్ పోస్టర్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ షాట్స్ సైతం చిరు పోస్టర్ ను చూసి అవాక్కయి ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టేశారు. ఈ పోస్టర్ కు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి మళ్లీ చిరంజీవి స్టామినా ఏంటో చెప్పకనే చెప్పేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ఇప్పుడు అందరికీ కొత్త డౌట్ వచ్చిపడింది. అదేంటంటే.. పోస్టర్ లో చిరు లుకు చూస్తే మంచి పిటినెస్ తో ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో పిక్చర్ లో వెనుక నుండి కనిపించిన వ్యక్తి నిజంగా చిరంజీవేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ చిరు ను చూసిన ఎవ్వరికైనా అర్ధమవుతుంది ఆయన తగ్గలేదన్న విషయం. అంటే… బయట కనపడుతున్న చిరు బాడీకి, పోస్టర్ లో కనపడుతున్న బాడీకి సంబంధం లేకుండా ఉంది. అందుకే పోస్టర్ లో ఉంది మెగాస్టార్ చిరంజీవా? మెగా పవర్ స్టార్ రామ్ చరణా?..చెర్రీతో ఈ మోషన్ పిక్చర్ ను తయారు చేయించారా..? అన్నది క్వశ్చన్. మరి ఈ రహస్యం చిత్ర యూనిట్ కే తెలియాలి..దీనికి సమాధానం చెప్పాలంటే వారే చెప్పాలి.