TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెళ్లి మండపంలో స్విగ్గీ బాయ్...10 నిమిషాల్లో డెలివరీ.. వీడియో వైరల్!.

Published on: Wed May 20, 2026 4:41PM

 

భారతీయ వివాహాల్లో సందడి, హడావిడి, చివరి నిమిషం టెన్షన్లు కామన్‌గానే ఉంటాయి. అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో జరిగిన ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెళ్లి తంతు మధ్యలో హోమానికి అవసరమైన సమిధలు అయిపోవడంతో పెళ్లివారు టెన్షన్ పడిపోయారు. కానీ అదే సమయంలో టెక్నాలజీ అండగా నిలిచి పెళ్లిని ఆపకుండా కాపాడింది.

ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకలో పూజారి హోమానికి సరిపడా సమిధలు లేవని గుర్తించాడు. పెళ్లి కార్యక్రమం ఇప్పటికే మొదలైపోవడంతో వెంటనే బయటకు వెళ్లి కట్టెలు తీసుకురావడం ఎవరికీ సాధ్యపడలేదు. దీంతో పెళ్లి మండపంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో అక్కడ ఉన్న వారిలో ఒకరు వెంటనే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో సమిధల కోసం ఆర్డర్ పెట్టారు.

అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేవలం 10 నిమిషాల్లోనే స్విగ్గీ డెలివరీ బాయ్ కట్టెలతో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. స్టేజ్‌పై ఉన్న సమిధలు పూర్తిగా అయిపోయేలోపే కొత్త సమిధలను అందించడంతో పెళ్లి తంతు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగింది. ఈ సన్నివేశాన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయగా అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ వీడియోను సుప్రియా మిట్టపల్లి అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో సందడి చేస్తున్నారు. “ఇకపై పెళ్లి కొడుక్కి బెల్ట్ మరిచిపోయినా.. పెళ్లికూతురి గాజులు మిస్ అయినా స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తారు” అంటూ సరదాగా స్పందిస్తున్నారు. మరోవైపు స్విగ్గీ కూడా “ఔర్ కుచ్ చాహియే?” అంటూ ఫన్నీ రిప్లై ఇవ్వడంతో ఆ కామెంట్ కూడా వైరల్ అవుతోంది.ఈ ఘటనతో “క్విక్ కామర్స్” సేవలు ఇప్పుడు కేవలం కిరాణా సరుకులకే కాకుండా పెళ్లి తంతుల్ని కూడా కాపాడుతున్నాయంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.