TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నటితో ఎంపీ చిలిపి చేష్టలు!

Published on: Sun Nov 3, 2013 3:34PM

 

మలయాళ నటి శ్వేతా మీనన్ పట్ల కేరళ ఎంపీ పీతాంబర కురువ్ అసభ్యంగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని నటి శ్వేతా మీనన్ కూడా ధ్రువీకరించారు. కేరళలోని కొల్లాంలో జరిగిన పడవల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో తాను పాల్గొన్నానని, అక్కడ ఒక రాజకీయవేత్త తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె చెప్పారు. తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్వేతా మీనన్ తనతో అసభ్యంగా ప్రవర్తించిన రాజకీయవేత్త పేరు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంలో తాను కేరళ సీఎం ఊమెన్ చాందీని కలసి ఆ రాజకీయవేత్త పేరును ఆయనకే చెబుతానని శ్వేతామీనన్ ప్రకటించారు.

 

అయితే ఆ కార్యక్రమంలో శ్వేతామీనన్‌తోపాటు ఎంపీ పీతాంబర కురువ్ కూడా పాల్గొనడంతో మీడియా మొత్తం పీతాంబర కురువన్ శ్వేతా మీనన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వార్తలు ప్రసారం చేసింది. అయితే ఎంపీ పీతాంబర కురువన్ మాత్రం తనమీద వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇంతకీ శ్వేతా మీనన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని భావిస్తున్న ఎంపీ పీతాంబర కురువ్ వయసు ఎంతో తెలుసా... 73 సంవత్సరాలు.