TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అడ్డంగా దొరికిన కూడా సపోర్ట్ ఇస్తున్నారట

Published on: Thu Dec 19, 2013 1:27PM

 

ఇటీవలే వ్యభిచారం కేసులో అడ్డంగా దొరికిపోయిన శ్వేతాబసుప్రసాద్ కు అభిమానులు బాసటగా నిలుస్తున్నారట. ఈ విషయంపై శ్వేత ఓ మీడియాతో మాట్లాడుతూ... "ఈ వివాదం నన్నేమీ.. లేదా నా ప్రతిష్టనేమీ దిగజార్చలేదు. ఇదెలా ఉందంటే.. కంటికి కనబడని దయ్యాన్ని చూపించినట్టుగా ఉంది. అందువల్లే ఈ స్టింగ్ ఆపరేషన్ పై ఇన్నాళ్ళు నేను పెదవి విప్పకుండా మౌనంగా ఉన్నాను" అని అన్నది. అదే విధంగా తనకి సపోర్ట్‌గా ఆన్ లైన్‌లో అనేకమంది నిలిచినందుకు ఈమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఏది ముఖ్యమో, ఏది కాదో ప్రజలు ఇప్పుడు బాగా తెలుసుకుంటున్నారని అంటూ శ్వేతాబసు తన సపోర్టర్లకి థ్యాంక్స్ చెప్పింది. నిజమే మరి! బడా రాజకీయ నాయకులను, సినీ తారల చీకటి వ్యాపారాలను బయటపెట్టడానికి ఎలాంటి సాహసం చేయని టీవి చానెల్స్.. ఇలాంటి చిన్న చిన్న చేపలను మాత్రం ధైర్యంగా చూపించేస్తున్నారు.