టీటీడీ చైర్మన్ గా స్వరూపానంద స్వామి!!
Published on: Tue Jun 4, 2019 12:43PM

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుంచి గత సీఎంలకు భిన్నంగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. టీటీడీ చైర్మన్ ఎంపిక విషయంలో కూడా జగన్ కాస్త భిన్నంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం టీటీడీ చైర్మన్ లుగా రాజకీయ నాయకులో, అధికార పార్టీ సానుభూతిపరులో ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ పద్దతికి జగన్ చరమగీతం పాడబోతున్నారట.
ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ వున్నారు. ఇప్పుడు అధికారంలోకి వైసీపీ రావడంతో.. టీటీడీ చైర్మన్ గా జగన్ ఎవరిని ఎంపిక చేస్తారని కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. టీడీపీ ఛైర్మన్ పదవి కోసం సినీ నటుడు మోహన్‌బాబు పేరు తెరపైకి వచ్చింది. ఆయనతో పాటు ఇదే పదవిని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆశిస్తున్నారని తెలుస్తోంది. వైఎస్ హయాంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకర్‌రెడ్డి కూడా ఈ పదవి కోసం లైన్‌లో వున్నారట. అయితే వీరందరినీ కాదని తిరుమల చరిత్రలోనే కొత్త వ్యక్తిని జగన్ రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని, తద్వారా తిరుమల పవిత్రలను కాపాడిన వాడిగా పేరొస్తుందని జగన్ భావిస్తున్నారట. మరి జగన్ ఆలోచనను స్వరూపానందేంద్ర అంగీకరిస్తారో లేదో చూడాలి.


