TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన సీఎం చంద్రబాబు

Published on: Sat Jul 19, 2025 8:25PM

 

ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యాటనలో కపిలేశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు. చీపురుతో ఊడ్చి, అనంతరం శుభ్రంగా తుడిచారు. పారిశుద్ధ్య కార్మికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి గ్రూప్ ఫొటో కూడా దిగారు. ఈ ఫొటోలను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పర్యటన సందర్భంగా, శ్రీ కపిలేశ్వరాయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. 

ఆలయానికి వచ్చిన ఆయన అధికారులు, అర్చక స్వాములు సంప్రదాయబద్ధ స్వాగతం పలికారు. పవిత్ర వస్త్రం కప్పి, వేదాశీర్వచనం అందించారు. అంతకుముందు, తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని తూకివాకంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. నిత్యం గోధుమ కలర్ డ్రెస్‌లో కనిపించే సీఎం చంద్రబాబు కొత్త దుస్తుల్లో దర్శమిచ్చారు.