స్వామీజీ ఆర్డర్ వేశారు.. మంత్రి గారు గప్ చుప్

జగన్ ప్రతిపక్షం లో ఉన్న సమయంలో ఆయనతో యాగాలు చేయించి మరీ తన ఆశీస్సులతో ఆయనను సీఎం పదవిలో కూర్చోబెట్టారు శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. అప్పటి నుండి స్వామి వారి హవా ఏపీలో అప్రతిహతంగా సాగుతోంది. దీంతో ఇటు ఏపీలోని ఉన్నతాధికారులతో పాటు బడా బడా నేతలు కూడా శారదా పీఠానికి క్యూ కడుతున్నారు. అయితే కొద్దీ రోజుల క్రితం తన పుట్టినరోజుకు అన్ని దేవాలయాల్లో పూజలు చేయించాలనే ఆర్డర్లు ఇప్పించి ఆ తరువాత ఆ విషయం వివాదం కావడంతో ఆ తరువాత వెనక్కు తగ్గారు. ఇప్పుడు ఎక్కడ ఏ దేవాలయంలో ఎవరు ట్రస్టీగా ఉండాలనేది కూడా ఆయనే డిసైడ్ చేసేస్తున్నారు.

 

తాజాగా భీమిలి దగ్గర గుడిలోవలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం విషయంలో కూడా అదే జరిగింది. ట్రస్టు బోర్డులో ఎవరెవరిని అపాయింట్ చేయాలో స్వరూపానందస్వామి పేర్లు ఇస్తే.. అక్కడి అధికారులు దానిని ఆమోదించేసారు. ఈ నియామకాలకు దేవాదాయశాఖ కమిషనర్ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చేసిందట. అయితే ఎటొచ్చి స్థానిక ఎమ్మెల్యే ప్లస్ మంత్రి కూడా అయిన అవంతి శ్రీనివాసరావుకు మాత్రం అసలు సమాచారం లేదట. అయితే తీరా తెలిశాక ఆయన మండిపడ్డారట. ఫైనల్ గా ఆ రికమెండేషన్ ఎవరు చేశారో తెలిశాక పాపం గప్ చుప్ గా నోరు మూసుకున్నారని సమాచారం.