ట్రిపుల్ తలాక్ పై యూపీ మంత్రి... కోరికలు తీర్చుకోడానికే...
Published on: Sat Apr 29, 2017 5:42PM

మూడు సార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇచ్చేసి, మరొకరిని పెళ్లి చేసుకునే పద్ధతిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై దేశంలోని పలు చోట్ల పలువురు ముస్లిం మహిళలు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, త్రిపుల్ తలాక్‌పై ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి, బీజేపీ నేత స్వామి ప్రసాద్ మౌర్య తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. తలాక్ కు ఎటువంటి ప్రాతిపదిక లేదని.. ముస్లిం మహిళలకు తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.


