TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జ‌గ‌న్‌కి హిందువుల పండుగలంటే చిన్నచూపా?

Published on: Fri Dec 24, 2021 2:44PM

హిందూ పండుగ‌ల‌కు క‌రోనా ఆంక్ష‌లు. మ‌రి, క్రిష్మ‌స్‌కు ఎందుకు లేవు? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఒమిక్రాన్ వ‌ర్రీ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్నా.. ఏపీలో ఇప్ప‌టికే మూడు ఒమిక్రాన్ కేసులు న‌మోదైనా.. ప్ర‌భుత్వం త‌గు చ‌ర్చ‌లు ఎందుకు తీసుకోవ‌డం లేదు? ఇప్ప‌టికే యూపీలో రాత్రి క‌ర్ఫ్యూ విధించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల‌తో క‌ఠిన నిబంధ‌న‌ల దిశ‌గా కేసీఆర్ స‌ర్కారు ఆలోచ‌న చేస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం ఒమిక్రాన్‌పై ఎలాంటి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌డాన్ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. క్రిస్మ‌స్ వేళ సామూహిక ప్రార్థ‌న‌లు చేస్తే.. ఒమిక్రాన్ వ్యాపించే ప్ర‌మాదం ఎక్కువ‌వుతుంద‌ని అంటున్నారు. న్యూఇయ‌ర్ టైమ్‌లో పార్టీలని వేడుక‌లు చేసుకుంటే.. మ‌రింత ముప్పు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.  

తాజాగా, సీఎం జగన్‌రెడ్డిపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర విమర్శలు చేశారు. గతంలో డెల్టా పేరుతో పండుగలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని.. ఒమైక్రాన్ దృష్ట్యా క్రిస్మస్‌పై ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదని ప్రశ్నించారు. హిందువుల పండుగలపైనే జగన్‌కి కరోనా గుర్తుకు వస్తుందా అని నిలదీశారు. హిందువుల పండుగలంటే జగన్‌కి చిన్నచూపని అన్నారు. 

ఏపీలో పథకం ప్రకారం ఆలయాలపై దాడులు చేశారని స్వామి ప‌రిపూర్ణానంద‌ మండిపడ్డారు. అంతర్వేది ఘటన నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదని త‌ప్పుబ‌ట్టారు. పింక్ డైమండ్ అని ఎన్నికల ముందు అభూత కల్పన సృష్టించారని విమ‌ర్శించారు. నిజంగా పింక్ డైమండ్ ఉందా? లేదా? తేల్చాలని నిల‌దీశారు.  

టీటీడీకి నిధులు కావాలంటే వేరే మార్గాలు ఎంచుకోవాలని.. స్వామి వారి మీద ప్రయోగాలు చేయడం తగదన్నారు. దేవుడి సేవలు అని చెప్పి డబ్బు సంపాదించడం మానేయాలని హితవు పలికారు. టీటీడీ లక్ష్యం వేదాన్ని రక్షించడమేనని పరిపూర్ణానంద తెలిపారు.