TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లేనిపక్షంలో మళ్లీ సమ్మె స్వామి గౌడ్

Published on: Sun Jan 22, 2012 1:57PM

హైదరాబాద్: వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని లేనిపక్షంలో మళ్లీ సమ్మెకు దిగుతామని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమాఖ్య అధ్యక్షుడు స్వామిగౌడ్ డిమాండ్ చేశారు. టిఎన్జీవో నేతలు స్వామి గౌడ్, దేవి ప్రసాద్, విఠల్, శ్రీనివాస్ గౌడ్‌లు ఆదివారం ఉదయం ఆజాద్‌ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌ను కోరినట్టు చెప్పారు. బిల్లు పెట్టని పక్షంలో ఉద్యోగ సంఘాలు సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పామన్నారు. మరోసారి సమ్మె చేసే పరిస్థితి ఉత్పన్నం కాదని కూడా ఆజాద్ హామీ ఇచ్చారన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున సోనియా గాంధీ తెలంగాణ అంశం ప్రస్తావించడం లేదని ఆజాద్ తమకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. కాగా ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి తన ఇంట్లో ఆజాద్‌కు అల్పాహార విందు ఇచ్చారు. ఇక్కడే టిఎన్జీవో నేతలు ఆజాద్‌ను కలిశారు.