తెలంగాణ వాదుల స్వాభిమాన స‌ద‌స్సు

Publish Date:Sep 9, 2013

Advertisement

 

ఏపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంద్రప్రదేశ్ స‌భ ఘ‌న విజ‌యం సాదించ‌టంతో ఇప్పుడు అదే స్ధాయిలో భారీ బ‌హిరంగ స‌భ‌కు ప్లాన్ చేస్తుంది తెలంగాణ రాజ‌కీయ జేఎసి. ఈ నెల 22న ఎన్టీఆర్ స్టేడియంలో అవ‌గాహ‌నా స‌ద‌స్సు పేరుతో ఓ స‌భ నిర్వహించ‌నున్నారు. ఈ నెల 12న జ‌ర‌గ‌నున్న జెఎసి విస్తృత స్థాయి స‌మావేశంలో ఈ స‌భ‌కు సంబందించి పూర్తి వివ‌రాలు వెల్లడించానున్నారు.

చాలా రోజుల ఢిల్లీ ప‌ర్యట‌న త‌రువాత హైద‌రాబాద్ చేరుకున్న కెసిఆర్ వివిద ప‌క్షాల నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమ‌వారం కెకె స‌మావేశం అయ్యారు కెసిఆర్‌. ఈ స‌మావేశంలో 22న త‌ల‌నెట్టిన స‌భ‌కు సంబందించిన చ‌ర్చ జ‌రిగింది. ఈ స‌భ‌కు స్వాభిమాన స‌ద‌స్సు పేరు  పెట్టారు. దీంతో పాటు 12న జ‌రిగే విస్తృత స్థాయి స‌మావేశానికి కెసిఆర్ హాజ‌ర‌వుతార‌ని ప్రక‌టించారు.