TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ప్లీజ్ ఆత్మహత్య చేసుకోవద్దు...

Published on: Fri Mar 31, 2017 12:17PM

 

కేంద్రమంత్రి సుష్మ స్వరాజ్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. తన వద్దకు వచ్చిన ఏ సమస్యపైన అయినా సుష్మ స్పందించి దానికి వెంటనే పరిష్కారం చూపుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తాజాగా మరో యువతికి సాయం చేశారు సుష్మ. వివరాల ప్రకారం... తన భర్త న్యూజిలాండ్ లో ఉన్నాడని, అతన్ని కలుసుకునేందుకు వీసా కోసం ప్రయత్నిస్తుంటే, మూడు సార్లు రిజెక్ట్ అయిందని, ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమని జ్యోతి ఎస్ పాండే అనే యువతి సుష్మకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. ఇక ట్వీట్ కు స్పందించిన సుష్మ.."మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. సమస్యేంటో నాకు చెప్పండి" అంటూ రీ ట్వీట్ పెట్టారు. ఆపై వీసా దరఖాస్తు కాపీని తన కార్యాలయానికి పంపాలని చెబుతూ, తన ఈమెయిల్ అడ్రస్ ను కూడా ఇచ్చారు. దీంతో ఆ యువతి సుష్మను అభినందించారు. తన గోడు విన్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.