సింగం-2 హీరో సూర్య కేక
Published on: Fri Jul 5, 2013 3:19PM
.jpg)
హీరో సూర్య, అనుష్క, హన్సిక ప్రధాన తారాగణంగా రూపొందిన 'సింగం-2' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజైంది. 'సింగం-2' లో సూర్య మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సూర్య వన్ మాన్ షో అని చెప్పవచ్చు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సూర్య నటన చాలా బాగుంది. సినిమాలో సూర్య చెప్పే డైలాగ్స్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. డైరెక్టర్ హరి మరోసారి తన సత్తా చూపించాడు. సూర్య నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలో తనకే తెలుసునన్నట్లు 'సింగం-2' మలిచాడు. హన్సిక సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర చేసింది కానీ చాలా తక్కువ సేపు స్క్రీన్ మీద కనపడుతుంది. అనుష్క పాటలవరకే పరిమితమైంది. వివేక్..సంతానం కామెడీ, స్టంట్స్, డాన్స్ స్వీక్వెన్స్ అదుర్స్ అనిపించాయి.


