Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రైనా క్లీన్ బౌల్డ్... పెళ్లయింది
posted on: Apr 4, 2015 11:39AM
.jpg)
భారత క్రికెటర్ సురేశ్ రైనా ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన ప్రియాంకను వివాహం చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి స్థానిక స్టార్ హోటల్లో పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. భారత క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని తన భార్య సాక్షి సింగ్‌తో రాగా ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మైక్ హస్సీ, మోహిత్ శర్మ, సెహ్వాగ్, డ్వేన్ బ్రేవో, విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తో సహ పలువురు రాజకీయ నాయకులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ లు దగ్గరపడుతున్నాయి. ఈ మ్యాచ్ లలో రైనా కూడా ఆడాల్సి ఉంది. దీంతో పెళ్లయినా కూడా ఈ జంట కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాల్సి వస్తుంది.






