అవినాష్ ముందస్తు బెయిలుపై సుప్రీం స్టే
Published on: Fri Apr 21, 2023 1:23PM
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ముందస్తు బెయిలుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.
అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకూ అరెస్టు చేయవద్దంటూ తెంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అయితే అవినాష్ రెడ్డి న్యాయవాదుల విజ్ణప్తి మేరకు ఆయనను సోమవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే అవినాష్ కు సుప్రీం నోటీసులు జారీ చేసింది.


