తెలంగాణలో వైద్య విద్య అభ్యసించాలంటే స్థానికత తప్పనిసరి.. సుప్రీం
Published on: Mon Sep 1, 2025 12:06PM
.webp)
వైద్య విద్యార్థుల స్థానికత అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పని సరి అని పేర్కొంది. ఈ మేరకు గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టేసింది.
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.33 ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణలో స్థానిక రిజర్వేషన్లు పొందాలంటే, కనీసం 9వ తరగతి నుంచి 12 వరకు రాష్ట్రంలో చదవాల్సిందేనని సర్కార్ పెట్టిన నిబంధనను సమర్ధిస్తూనే.. గతేడాది ఇచ్చిన మినహా యింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులను మాత్రం అలాగే కొనసాగించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.


