పోలవరంపై స్టేకి సుప్రీంకోర్టు నిరాకరణ
Published on: Mon Aug 11, 2014 2:43PM
.png)
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడాన్ని వ్యతిరేకిస్తూ, ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడంపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌కి సుప్రీం కోర్టు నో చెప్పింది. తెలంగాణకు చెందిన ఒక న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు విభజన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్‌కు పోలవరం పిటిషన్‌ను జత చేసింది. ఈ కేసులో ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా నోటీసులపై సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఆ తర్వాత ప్రధాన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు పోలవరం పిటిషన్‌పై విచారణ జరుపనున్నట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు.


