TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బండికి ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంద్? సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం!

Published on: Thu Aug 6, 2026 1:02PM

భారతదేశంలో రోడ్డు భద్రత మరియు వాహన నిబంధనల అమలుపై అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన పరిశీలనలు చేసింది. రహదారులపై తిరిగే ప్రతీ వాహనానికి చెల్లుబాటు అయ్యే బీమా పాలసీ ఉండటం చట్టరీత్యా తప్పనిసరి అయినప్పటికీ, చాలామంది వాహనదారులు బీమా రెన్యూవల్ చేయకుండానే నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సుప్రీంకోర్టు ఒక విప్లవాత్మకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయడాన్ని నిలిపివేయాలని అభిప్రాయపడింది. దీనివల్ల ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకునేలా ఒత్తిడి పెరుగుతుందని సుప్రీంకోర్టు భవిస్తుంధి.

ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి ముందుగా ఒక ప్రత్యేక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ, పెట్రోల్ బంకుల్లో ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఇంధన విక్రయాలు నిరాకరించే ప్రక్రియ ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ దశలోనే ఉందని నివేదించింది. సంబంధిత అధికారులు త్వరలోనే దీనిపై సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారని కోర్టుకు తెలిపింది. ఒకవేళ ఈ విధానం దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలైతే, ఇన్సూరెన్స్ పత్రాలు సరిగ్గా లేని వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ లభించడం దాదాపు అసాధ్యంగా మారనుంది.

రహదారులపై భద్రతను పెంచేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇందులో భాగంగా రహదారులపై ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను వాహన రిజిస్ట్రేషన్ మరియు బీమా డేటాబేస్‌లతో అనుసంధానించాలని ఆదేశించింది. ఈ కెమెరాలు రహదారిపై వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి, ఇన్సూరెన్స్ లేని వాహనాలను స్వయంచాలకంగా గుర్తిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా సదరు వాహనదారులకు ఆటోమేటిక్‌గా ఈ-చలాన్లు జారీ అయ్యే వ్యవస్థను తీసుకురావాలని పేర్కొంది. అంతేకాకుండా, రహదారి తనిఖీల సమయంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల బీమా వివరాలను తక్షణమే తనిఖీ చేయడానికి వీలుగా వారి వద్ద మొబైల్ యాప్‌లు లేదా హ్యాండ్‌హెల్డ్ పరికరాలు ఉండాలని ఆదేశించింది.

no insurance no petrol supreme court guidelines,vehicle insurance mandatory petrol pumps india.