స్వలింగసంపర్కం తీర్పుపై సమీక్షించండి...

 

 

 

సుప్రీంకోర్టు స్వలింగసంపర్కంపై ఇచ్చిన తీర్పుపై సర్వతా ఆవేదన, ఆశ్చర్యాలు వ్యక్తమైన విషయం విదితమే. స్వలింగసంపర్కం నేరమే నంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన నేపధ్యంలో ఆ తీర్పును పున: సమీక్షించాలని కోరుతూ గురువారం పిటీషన్‌ దాఖలైంది. నాజ్‌ ఫౌండేషన్‌ అనే స్వఛ్చందసంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. తీర్పును పున:సమీక్షించాలని, స్వలింగసంపర్కుల హక్కులను పరిరక్షించాలని పిటిషన్‌ దారు కోరారు.