TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ సర్కార్ కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. 

Published on: Thu Sep 23, 2021 4:28PM

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగలడం కామన్ గా మారిపోయింది. కోర్టుల్లో వరుసగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఏపీ హైకోర్టులో రోజూ ఏదో కేసులో జగన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వస్తుండగా.. తాజాగా సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. దేవీ సీఫుడ్స్ లిమిటెడ్ కేసులో జగన్ సర్కార్ కు షాకిచ్చింది సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. 

దేవి సీఫుడ్స్ కేసులో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ధిక్కరణ మినహాయింపును ఇవ్వాలని సుప్రీంను కోరింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేసింది. ప్రభుత్వానికి లక్ష రూపాయల జరిమానా విధించింది.