TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

హైకోర్టుకే వెళ్లండి.. రవిప్రకాష్ కు సుప్రీం ఆదేశం

Published on: Mon Jun 3, 2019 5:25PM

 

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే, ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాష్ తిరిగి హైకోర్టుకే వెళ్లాలని సుప్రీం సూచించింది. ఈ పిటిషన్‌పై మెరిట్‌ ఆధారంగా విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీచేసింది. 

రవిప్రకాష్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఆయన తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించగా.. సుప్రీం పలు ఆదేశాలు జారీచేసింది. జూన్‌ 10న విచారణ జరిపి ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. అలాగే, 41ఏ నోటీసు కింద రవిప్రకాష్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయాలనుకుంటే మాత్రం 48గంటలకు ముందుగానే నోటీసులు ఇవ్వాలని స్పష్టంచేసింది.