కర్ణాటక బలపరీక్ష మీద తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు !

 

ఎట్టకేలకి కర్ణాటక రాజకీయాలపై సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఈరోజు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ మీద విచారించిన సుప్రీం కోర్టు విచారణ చేసింది. నిన్ననే అసెంబ్లీలో బల పరీక్ష చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును కోరారు. ఆ పిటిషన్ నిన్న వేయగా ఈరోజు విచారణకి వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపధ్యంలో ఎప్పుడు వోటింగ్ జరపాలనే విషయం మీద తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.

అయితే రేపటికి కూడా బలపరీక్ష జరగని పక్షంలో రేపు మళ్ళీ విచారిస్తామని పేర్కొన్న సుప్రీం కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇక విశ్వాస తీర్మానంపై కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సభలో 70 మంది ఎమ్మెల్యేలున్నారు. సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ పక్షనేత సిద్ధరామయ్య అయితే ప్రస్తుతం సభలో లేరు. సీఎం కుమారస్వామి రెబల్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాతే బలపరీక్ష ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.