లివ్ ఇన్ రిలేషన్ షిప్ తప్పేం కాదు..
Published on: Mon May 7, 2018 3:45PM
.jpg)
సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పునిచ్చింది. సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్లకు మేజర్ అయ్యేంతవరకూ వివాహం చేసుకోకూడదు అన్న నిబంధనలు ఉండేవి. అయితే ఇప్పుడు పెళ్లి సమయానికి అబ్బాయి మేజర్ కాకున్నా అమ్మాయి మేజర్ అయితే అతడ్ని పెళ్లి చేసుకునే హక్కు ఆమెకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గత ఏడాది ఏప్రిల్ లో ఓ యువకుడు తన కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయి వివాహం చేసుకున్నాడని, అప్పుడు అతని వయస్సు 20 ఏళ్ళు మాత్రమేనని, అందువల్ల ఈ పెళ్లి చెల్లదని ప్రకటించాలని ఓ వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఈ మ్యారేజ్ ని రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. అయితే ఆ తీర్పును సుప్రీంకోర్టు తప్పు పట్టింది. నంద కుమార్ అనే ఆ యువకుడికి 21 ఏళ్ళు నిండకపోయినా.. వారిద్దరినీ మేజర్లుగానే తాము పరిగణిస్తున్నామని అంతేకాదు....నంద కుమార్ ను ప్రేమించిన అమ్మాయి కోరుకుంటే ఆయనతో కలిసి జీవించ వచ్చునని (లివ్-ఇన్-రిలేషన్ షిప్), ఇది తప్పేం కాదని తీర్పునిచ్చింది.


